Saturday, May 4, 2024

ట్రక్కును ఢీకొన్న పెళ్లి బృందం కారు..తొమ్మిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ లోని ఝలావర్ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొని తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లోని డుంగ్రి గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి కారులో పదిమంది వస్తుండగా, కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఝలావర్ జిల్లా ఎక్లేరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా 1630 ఏళ లోపు వారే. మృతుల్లో రోహిత్ (16), సోను (22), దీపక్ (24), ఈ ముగ్గురూ అన్నదమ్ములని ఎక్లేరా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సందీప్ విషోనీ చెప్పారు.

మిగతా మృతుల్లో అశోక్ (24). హేమ్రాజ్ (33), రవిశంకర్ (25), రాహుల్ (20), వీరంతా ఎక్లేరా గ్రామం బగరీ మొహల్లాకు చెందిన వారు. రోహిత్ (22), రామక్రిష్ణన్ (20), ఝలావర్ జిల్లా ఖాన్పూర్, బారన్ జిల్లా హర్నవాడ ఏరియాకు చెందిన వారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 18 ఏళ్ల మనీష్ బగరి పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ అధికారి సందీప్ చెప్పారు. కారు మారుతి సుజుకి ఒమ్మీ పూర్తిగా నుజ్జునుజ్జు అయిందని డిఎస్‌పి హేమంత్ గౌతమ్ తెలియజేశారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపు లోకి ప్రశ్నిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయకులు గకారు అద్దాలను పగుల గొట్టి తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News