Monday, April 29, 2024

క్రీడా అకాడమీలకు సిఎం కెసిఆర్ ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ( శాట్స్) శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న క్రీడా అకాడమీలకు సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం కల్పిస్తున్నదని స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు ఏనాడు పట్టించుకోని నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు గత దశాబ్ద కాలం నుంచి క్రీడా అకాడమీలు స్పోర్ట్ స్కూల్‌లపై శాట్స్ శాఖ ప్రత్యేక శ్రద్ధతో అనేక చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సిఎం కెసిఆర్ ఆరు నూతన స్పోర్ట్ అకాడమీలను ప్రారంభించారన్నారు.

క్రీడా పాఠశాలలు, అకాడమీల నిర్వహణపైనా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ప్రతి ఏటా ఖర్చు చేస్తోందన్నారు. ఈ మేరకు సోమవారం ఎల్ బి స్టేడియంలో రాష్ట్రంలో ఉన్న క్రీడా అకాడమీలు, స్పోర్ట్ స్కూల్‌లపై ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు స్పోర్ట్ స్కూల్లు, అకాడమీలు ఇంకా మెరుగైన ఫలితాలు సాధించే దిశగా దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. స్పోర్ట్ స్కూల్ అకాడమీలలో శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి వారి ప్రొఫైల్స్ తయారు చేయాలని ఆదేశించారు.

సిఎం కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా, నిర్దిష్ట లక్ష్యాలతో అకాడమీలను నిర్వహించాలన్నారు.రాష్ట్రంలోని అన్ని అకాడమీలు, స్పోర్ట్ స్కూళ్లు , జిల్లా క్రీడా సంస్థలు అంతర్గత ఆడిట్‌ను పూర్తి చేసి వెంటనే సమర్పించాలని ఛైర్మన్ ఆదేశించారు. అకాడమీల స్పోర్ట్ స్కూల్స్ పనితీరు మెరుగుపరచడానికి ఛైర్మన్, ఎండితో పాటు అధికారులంతా నిరంతరం పర్యవేక్షించాలనీ, అకాడమీలను తరచుగా సందర్శించి, ప్రోత్సాహించాలని ఈ సందర్బంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. అకాడమీల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండే విధంగా ప్రతి మూడు నెలలకు ఓసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఈ సందర్బంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

క్రీడా, విద్య, శిక్షణ మాత్రమే కాక వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాల్లో కూడా వారికి నిపుణులతో శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. సంస్థ మెరుగైన ఫలితాల కోసం సిబ్బంది అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించి, పనితీరును సమీక్షించుకోవాలని ఈ సమీక్ష సమావేశంను మంగళవారం కూడా నిర్వహించనున్నామని ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్ అథారిటీ ఒఎస్‌డి డాక్టర్ కె. లక్ష్మి, డిప్యూటి డైరెక్టర్ జి. చంద్రారెడ్డి, ఎఎస్‌డి డాక్టర్ కె.నర్సయ్య, డివైఎస్‌ఓ జి అశోక్ కుమార్, డివైఎస్‌ఓలు సుధాకర్ రావు, పరంధామ్‌రెడ్డి, వెంకటేశ్వర్ రావు, అథ్లెటిక్ కోచ్ ఎండి గౌస్, బిఈ శాలినీ ప్రియతో పాటు అకాడమి ఇంఛార్జీలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News