Tuesday, May 21, 2024

కిరణ్ అద్భుతంగా నటించాడు

- Advertisement -
- Advertisement -

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీధర్ దర్శకత్వంలో ప్రమోద్, రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఎస్‌ఆర్ కళ్యాణ మండపం’. ఈ చిత్రాన్ని ఆగస్టు 6న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సాయికుమార్ పాల్గొని మాట్లాడుతూ “నాకు మంచి పేరును తీసుకువచ్చే చిత్రమిది. హీరో కిరణ్ అద్భుతంగా నటించాడు. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో చూసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నా”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరంతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

SR Kalyanmandapam movie released on Aug 6

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News