Tuesday, May 7, 2024

బార్స్, పబ్స్ కంటే థియేటర్స్ సేఫ్: నాని

- Advertisement -
- Advertisement -

Thimmarusu movie unit press meet

హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్.ఒరిజినల్స్ బ్యానర్స్‌పై మహేష్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. శుక్రవారం ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “సత్యదేవ్ మంచి నటుడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఓపెన్ అవుతున్న థియేటర్స్‌లో ‘తిమ్మరుసు’ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇక థియేటర్స్‌లో సినిమా చూడడం అనేది మన సంస్కృతి. అయితే కోవిడ్ టైమ్‌లో ముందుగా థియేటర్స్ క్లోజ్ చేసేసి, లాస్ట్‌లో థియేటర్స్‌ను ఓపెన్ చేస్తున్నారు. బార్స్, పబ్స్‌లో మాస్కులు తీసేసి పెద్డగా మాట్లాడుకుంటూ ఉంటారు.

అలాంటి వాటితో పోల్చితే థియేటర్స్ సేఫ్ ప్లేస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం సినిమా ను మాట్లాడకుండా చూస్తాం”అని అన్నారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ “దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ‘తిమ్మరుసు’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది”అని తెలిపారు. నిర్మాత మహేష్ కోనే రు మాట్లాడుతూ తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, బ్రహ్మాజీ, రాహుల్ సంక్రిత్యాన్, వెంకట్ మహా, ఝాన్సీ పాల్గొన్నారు.

Thimmarusu movie unit press meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News