- Advertisement -
రామేశ్వరం: తొమ్మిది మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. శ్రీలంక జలాల్లో వేట సాగిస్తున్నారన్న ఆరోపణపై ఒక మరబోటును స్వాధీనం చేసుకుంది. నెడుంతీవు వద్ద వీరు శనివారం అరెస్టు అయ్యారని మత్స్యశాఖ అధికారులు వివరించారు. శనివారం కచ్చతీవు వద్ద ఇరవై మరబోట్లలో వలలను శ్రీలంక నేవీ అధికారులు ధ్వంసం చేశారని మత్స్యకారులపై రాళ్లు, బాటిళ్లు విసిరారని అధికారులు చెప్పారు. ఈలోగా మరబోట్ల ఆపరేటర్లయిన మత్సకారులు శ్రీలంక నేవీ దౌర్జన్యం నిరసిస్తూ సోమవారం నుంచి నిరవధికంగా సమ్మె చేయాలని నిర్ణయించారు. శ్రీలంక లో బందీగా ఉన్న మత్స్యకారులను విడిచిపెట్టేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
- Advertisement -