Thursday, May 2, 2024

నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. “అర్జున ఫల్గుణ అనేది భారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ, విజయ… ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటే ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. ఉరుములు మెరుపులు పిడుగులు వస్తే అందరూ అర్జున ఫల్గుణ అని అనుకోమనేవారు. అలా అర్జున ఫల్గుణ అనే పేరులో ఆ వైబ్రేషన్స్ ఉంటుంది. ఈ సినిమాకు ముందుగా వేరే పేరు అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఒకరోజు వర్షంలో కూర్చుని డైరెక్టర్, నేను మాట్లాడుకున్నాం. అలా ఈ టైటిల్ వచ్చింది. ఇంతకుముందు నేను ఊరి బ్యాక్‌డ్రాప్ నుంచి సిటీకి వచ్చిన కథలు చేశాను. కానీ మొత్తం ఊరి బ్యాక్‌డ్రాప్‌లో చేయలేదు. ఇది చాలా ఫ్రెష్‌గా అనిపించింది.

అందుకే ఈ సినిమా చేశాను. డిగ్రీ అయిపోయి ఊరిలోనే ఉంటూ సంపాదించుకుందామనే కుర్రాళ్ల కథ ఇది. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊరిలోనే ఉండి పది వేలు సంపాదించుకొని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో వాళ్లు ఉంటారు. ఈ నేపథ్యంలో సినిమా సాగుతుంది. నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం. ‘అర్జున ఫల్గుణ’లో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషన్ బాగా ఉంటుంది. ప్రస్తుతం ‘భళా తందనాన’ అనే సినిమా చేస్తున్నాను. లక్కీ మీడియాలో మరో చిత్రం చేస్తున్నాను”అని అన్నారు.

Sri Vishnu about ‘Arjuna Phalguna’ movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News