Friday, April 26, 2024

వెబ్‌సైట్‌లో స్టాఫ్‌నర్స్ మెరిట్ జాబితా

- Advertisement -
- Advertisement -

Staff nurse results released

 

ఫలితాలు విడుదల చేసిన టిఎస్‌పిఎస్‌సి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వైద్య విధాన పరిషత్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి ఈ ఏడాది మార్చి 11వ తేదీన నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు మెరిట్ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కమిషన్ తెలిపింది. 3,311 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 26,412 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 21,391 మంది హాజరయ్యారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ పోస్టులకు 1ః 2 నిష్పత్తిలో ఈ నెల 13 నుంచి 19 వరకు ఆన్‌లైన్ విధానంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఇతర వివరాలకు టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్ చూడాలని కమిషన్ తెలిపింది.

రేపటి నుంచి ఎఫ్‌బిఒ పోస్టులకు ఫిజికల్ టెస్ట్

రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 9 నుంచి 12 వరకు నాలుగవ విడత ఫిజికల్ టెస్టు, ఈవెంట్లు నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. జిల్లాల్లో నిర్వహించనున్నట్లు ఈ ఫిజికల్ టెస్టు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫిజికల్ టెస్ట్, ఈవెంట్ల షెడ్యూల్, ఇతర వివరాలకు టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్ చూడాలని కమిషన్ తెలిపింది.

12న మేనేజర్ పోస్టులకు పరీక్ష

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్‌సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మేనేజర్(ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి ఈ నెల 12వ తేదీన హెచ్‌ఎండిఎ పరిధిలో పరీక్ష నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. అభ్యర్థులు తమ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News