Wednesday, May 15, 2024

నాటిన ప్రతి మొక్క పెరిగేలా చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

మద్దూరు : దామరగిద్ద మండలం నుంచి మద్దూర్ మీదుగా కోస్గి వరకు గల సుమారు 50 కిలో మీటర్‌ల ఇరువైపులా నాటిన మొక్కలను అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్‌తో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలను మొక్కుబడిగా నాటరాదన్నారు. హరితహారంలో నాటే మొక్కలను అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

హరితహారంలో నాటే మొక్కలు 2 మీటర్‌లు తగ్గకుండా చూడాలన్నారు. దామరగిద్ద, మద్దూర్ , కోస్గీ మండల పరిధిలోని ఇరువైపుల చిన్న మొక్కలను చూసి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వర్క్ ఆర్డర్ ప్రకారం పిట్టింగ్‌లకు, కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులను చెల్లించా లన్నారు. రోడ్డు నుంచి మీటర్ దూరంలో మొక్కలను నాటాలన్నారు.

హరితహారంలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్షం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులకు హెచ్చరించారు. రోడ్ వెంబడి అవెన్యూ, మల్టీలేయర్ మొక్కలలో దూరం ఉండేటట్లు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా అధికారి జడ్పి సిఈఓ జ్యోతి, ఎంపీడిఓ, పంచాయతీ సెక్రటరీ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News