Friday, April 26, 2024

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: సిఐ రత్నం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / ఆత్మకూర్ : తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు  ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని లేనిచో చర్యలు తప్పవని ఆత్మకూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రత్నం హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐ రత్నం కార్యాలయంలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘిస్తు బహిరంగ ప్రదేశాలలో తిరిగితే వ్యాధి వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని, గ్రామాలలో ప్రజాప్రతినిదులు నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. షాపింగ్ మాల్, హోటల్, కిరాణం, జనరల్ స్టోర్, బట్టల దుకాణాలలో నిబంధనలు పాటించాలన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని సూచించారు. 15 నుండి 18 సంవత్సరాలు నిండిన పిల్లలు వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News