Tuesday, May 21, 2024

యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

హీరో సుధీర్ బాబు తన కెరీర్‌లో 15వ చిత్రాన్ని ఎం. హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డైలాగ్ రైటర్‌గా మెప్పించిన హర్షవర్ధన్ ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్‌తో సుధీర్‌ని డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ‘లవ్ స్టొరీ’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో నారాయణ్ దాస్ కె. నారంగ్. పి.రామ్‌మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తం షాట్‌కి క్లాప్ కొట్టిన నిర్మాత పి.రామ్‌మోహన్ రావు.. దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమానికి సుధీర్ బాబు, హర్షవర్ధన్‌లతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వచ్చే వారం నుంచి ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు.

Sudheer Babu’s 15th Movie launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News