Tuesday, April 30, 2024

క్లైమాక్స్ ఛాలెంజింగ్‌గా అనిపించింది: రాహుల్ సంకృత్యాన్

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మీడియాతో మాట్లాడుతూ.. “స్క్రీన్‌ప్లే పరంగా, విజువల్‌గా ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో వాసు క్యారెక్టర్ కృతిశెట్టితో లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఇందులో ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది. దానిలో నుంచి ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ ఉంటుంది. ఇక దేవదాసి వ్యవస్థ అనే పాయింట్ కథ ప్రకారం బెంగాల్‌లో ప్రారంభమై ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు… ఇలా పాన్ ఇండియా స్థాయిలో చర్చిస్తాం. అయితే ఈ సినిమాలో దేవదాసి వ్యవస్థ అనేది మెయిన్ సబ్జెక్ట్ కాదు. కథలో హీరో దానికి వ్యతిరేకంగా పోరాడుతాడు. ఈ స్క్రిప్ట్ అనుకున్న రోజే ‘శ్యామ్ సింగ రాయ్’ టైటిల్ అనుకున్నాం. నాని నుంచి ఆయన ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇక క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరణ చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. రెండు రోజులు క్లైమాక్స్ షూటింగ్ చేశాం. సాయిపల్లవి మంచి డ్యాన్సర్. ఈ సినిమా కోసం ఆమె క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఆమెతో పాటను ఏడు రోజులు షూటింగ్ చేశాం. ఇక ప్రస్తుతం టైమ్ ట్రావెల్ జోనర్‌లో ఒక కథ సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత దాని గురించి ఆలోచిస్తా”అని అన్నారు.

Director Rahul Sankrityan about Shyam Singha Roy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News