Friday, May 3, 2024

వైవాహిక వివాదాలు పెరిగిపోతున్నాయి

- Advertisement -
- Advertisement -

Supreme court concern over Marital disputes

 

న్యూఢిల్లీ: దేశంలో ఇటీవలి కాలంలో వైవాహిక వివాదాలు గణనీయంగా పెరిగిపోయాయని, ఇప్పుడు వివాహ వ్యవస్థచుట్టూ తీవ్ర అసంతృప్తి, ఘరషణలే అలముకొని ఉన్నాయని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. దీని కారణంగా భర్తపైన, అత్తింటివారిపైన వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి భారత శిక్షాస్మృతిలోని ఐపిసి 498లాంటి సెక్షన్లను ఉపయోగించుకోవడం పెరిగిందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. భర్త, అత్తింటి వారు గృహిణిని వేధింపులకు గురి చేయడడానికి సంబంధించిన నేరాల కోసం ఐపిసిలో 498ఎ సెక్షన్‌ను చేర్చడం జరిగింది. అయితే ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేయడంపై సుప్రీంకోరు అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసిందని జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

తననుచిత్ర హింసలకు గురి చేస్తున్నారంటూ అత్తింటి వారిపై బీహార్‌లో ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను బెంచ్ కొట్టివేసింది. స్పష్టమైన ఆరోపణలు లేకుండా ప్రాసిక్యూషన్‌ను అనుమతించడం వల్ల న్యాయప్రక్రియ దుర్వినియోగం అవుతుందని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. తమపై మోపిన అభియోగాలను కొట్టివేయాలంటూ భర్త, ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టివేస్తూ 2019 నవంబర్‌లో పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వారు చేసుకున్న అపీలుపై సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. గృహిణిపై భర్త, అత్తింటి వారు పెట్టే చిత్రహింసలను అరికట్టేందు కోసమే ఐపిసి 98ఎ ఉంది తప్ప దాన్ని దుర్వినియోగం చేయడానికి కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News