Wednesday, May 8, 2024

గుర్తింపు ప‌త్రాల‌ను అడగకుండానే సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు రేష‌న్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

Supreme Court orders states to give dry ration to sex workers

 

ఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డు లేదా ఇతర గుర్తింపు ప‌త్రాల‌ను అడగకుండానే రేష‌న్ స‌రుకుల‌ను ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు నేడు అన్ని రాష్ర్టాల‌ను ఆదేశించింది. జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో), జిల్లా న్యాయ అధికారులు గుర్తించిన సెక్స్ వర్కర్లందరికీ డ్రై రేషన్ అందించాలని ఆదేశించింది. కోవిడ్‌-19 సంక్షోభంలో దేశ‌వ్యాప్తంగా సెక్స్ వ‌ర్క‌ర్లు ఎదుర్కొంటున్న క‌ష్టాల‌పై ఎన్జీఓ దర్బార్ మ‌‌హిళా సమన్వ‌య కమిటీ దాఖలు చేసిన పిటిష‌న్‌ఫై జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జ‌స్టిస్‌ అజయ్ రాస్తోగిలతో కూడిన ధర్మాసనం విచార‌ణ చేప‌ట్టింది. గుర్తింపు రుజువులు లేకపోవడం వల్ల సెక్స్ వర్కర్లు రేషన్, నగదు బదిలీ, ఇతర సదుపాయాలను పొందడం లేద‌ని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ర్ట ప్ర‌భుత్వాలేవి త‌మ తీర్పును ఉల్లం‌ఘించొద్ద‌ని త‌మ ఉత్త‌ర్వు అమ‌లు గురించి నాలుగు వారాల్లోగా తెలియ‌జేయాల‌ని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News