Thursday, May 2, 2024

కరోనా పరీక్ష ధరలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

Supreme Court question to center on CoVID 19 tests

 

జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
పేషెంట్లకు అందే సేవలపై రాష్ట్రాలు తనిఖీ చేయాలి

న్యూఢిల్లీ: కొవిడ్19 నిర్ధారణ పరీక్షల ధరల విషయంలో రాష్ట్రాల మధ్య ఉన్న వ్యతాసాలపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్రం జోక్యం చేసుకొని ఒకే విధమైన ధరల్ని నిర్ణయించాలని ఆదేశించింది. అయితే, ధరలు నిర్ణయించడం తమ పని కాదని, అది కేంద్రం బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ధరలు రాష్ట్రానికొక తీరుగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఒకే ధరలు ఉండేలా ఆదేశించాలంటూ వేసిన పిటిషన్‌పై జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎస్‌కె కౌల్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

ఆస్పత్రుల నిర్వహణ, కొవిడ్ పేషెంట్లకు అందుతున్న సేవల తనిఖీలకు అన్ని రాష్ట్రాలు నిపుణుల కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించింది. పేషెంట్లకు అందుతున్న సేవల్ని రికార్డు చేయడానికి ఆస్పత్రుల్లో సిసిటివిలు ఏర్పాటు చేయాలని ఆదేశించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్‌టిపిసిఆర్ పరీక్ష ధర విషయంలో విధించిన రూ.4500 పరిమితిని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) మే నెల చివరి వారంలో ఎత్తివేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ దిగుమతులపైనే ఆధారపడకుండా దేశీయంగా కిట్ల తయారీలో పురోగతి సాధించడంతో తక్కువ ధరలోనే పరీక్షల నిర్వహణకు అవకాశమేర్పడింది.

ఢిల్లీలో ఇటీవల కరోనా కేసులు పెరగడంతో కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసియు యూనిట్లు, ఐసోలేషన్ పడకల ధరలను తగ్గించాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలోనే ఐసిఎంఆర్ అనుమతించిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష గరిష్ట ధరను రూ.2200గా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చికిత్స ధరల్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కరోనా పరీక్ష గరిష్ట ధర ఢిల్లీలో రూ. 2400, ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ. 2500, మహారాష్ట్రలో 2200గా నిర్ణయించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News