Monday, May 6, 2024

రేవంత్‌రెడ్డికి తొలి షాక్..

- Advertisement -
- Advertisement -

Swarnam Ravi Goodbye to Congress

కాంగ్రెస్‌కు స్వర్గం రవి గుడ్‌బై…
ఈ నెల 30న టిఆర్‌ఎస్‌లో చేరిక….

హైదరాబాద్: టిపిసిసి చీఫ్‌గా పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డికి తొలి షాక్ తగిలింది. రేవంత్ నాయకత్వానికి హుజురాబాద్ ఉప ఎన్నిక పరీక్ష వేళ.. అదే నియోజకవర్గానికి చెందిన కీలక నేత, ఆర్థికంగా బలం కలిగిన పారిశ్రామికవేత్త ఒకరు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేసిన నేత స్వర్గం రవి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తన రాజీనామాను వెంటనేఆమోదించాల్సిందిగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కోరారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నానని, ఈ నెల 30న అధికార టిఆర్‌ఎస్‌లో చేరబోతున్నానని స్వర్గం రవి ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపున గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డి ఇప్పటికే టిఆర్‌ఎస్ గూటికి చేరగా.. తాజాగా రవి కూడా టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. వీరిద్దరూ టిఆర్‌ఎస్ టికెట్టును ఆశిస్తున్నవారేనని తెలుస్తోంది.

కాగా, స్వర్గం రవిని హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దింపేందుకు టిఆర్‌ఎస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలం అనుబంధం వుండటం, బిసి నేత కావడం.. అందునా ఆర్థికంగా బలంగా ఉండటంతో స్వర్గం రవి వైపే టిఆర్‌ఎస్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పలు రిపోర్టులతో పాటు ఇంటెలిజెన్స్ సర్వేల్లో సైతం స్వర్గం రవి అభ్యర్థిత్వంపై మంచి మార్కులు పడినట్లు తెలుస్తోంది. దీంతో టిఆర్‌ఎస్ స్వర్గం రవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, టిఆర్‌ఎస్ అభ్యర్థులెవరనే దానిపై ఇప్పటికే పలువురు నేతల పేర్లు వినవస్తుండగా.. వారిలో ఎన్‌ఆర్‌ఐ నేతలు సైతం ఉన్నారనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో స్వర్గం రవి టిఆర్‌ఎస్‌లో చేరనుండటం అతడికే టిఆర్‌ఎస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు గుప్పుమనడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News