Friday, April 26, 2024

శాస్త్ర సాంకేతిక రంగాల్లో పోటీ పడుతున్న భారత్

- Advertisement -
- Advertisement -
India is competing in fields of science and technology
భారత్ బయోటిక్ చైర్మన్ కృష్ణ ఎల్లా

హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ప్రపంచతో పోటీ పడుతుందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ చైర్మన్ డా. కృష్ణ ఎల్లా తెలిపారు. కొవిడ్ సంక్షోభం అనంతరం వ్యాక్సిన్లే దేశాలకు ఆయుధాలుగా మారాయని అభిప్రాయపడ్డారు. బుధవారం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై డా. కృష్ణయ్య, డా. బి. భాస్కర్‌రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ హెపటైటిస్ బి కి వ్యాక్సిన్ నేడు ప్రతి ఒకరికి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయని అదైర్యపడాల్సిన అవసరంలేదన్నారు. గతంలో ఒక వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావాలంటే ఏళ్ల తరబడి ట్రయల్స్ జరిగేవని, ప్రస్తుతం పెరుగుతున్న సాంకేతికతతో వేగంగా ట్రయల్స్ చేయగలుగుతున్నామన్నారు.

తాము మొదట రోటా వైరస్‌కు వ్యాక్సిన్‌కు ఎక్కువ ట్రయల్స్ తీసుకున్నామని, కొవిడ్ తక్కువ కాలంలోనే విజయవంతంగా పూర్తి చేసి కోట్ల మంది ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రి ఎండీ డా. బాస్కర్‌రావు ప్రసంగిస్తూ హెపటైటిస్ బి, సీ ప్రాణాంతకమైనప్పటికి మానవాళి మనుగడకే పెను ముప్పగా పరిణమించిన కొవిడ్‌ను ఎదుర్కొవడంలో ఎంతవరకు విజయం సాధించామన్న దానిపై చర్చించారు. ఈసందర్బంగా కొవిడ్ సంక్షోభంలో ముందుండి సేవలందించిన 300మంది వైద్య సిబ్బందిని మెమొంటోలతో సత్కరించి అభినందించారు. గత ఏడాదికిపైగా కొవిడ్ నిర్మూలనకు కిమ్స్ వైద్యుల ఆలోచనలు, విధులను అంకితం చేసినట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News