Friday, April 26, 2024

పొట్టి ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

ఫైనల్లో పాక్‌పై 5వికెట్ల తేడాతో జయకేతనం, హాఫ్‌సెంచరీతో మెరిసిన బెన్‌స్టోక్స్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సామ్ కరన్

 

టీ20 ప్రపంచకప్ 2022 విజేతగా ఇంగ్లాండ్ అవతరించింది. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన తుదిపోరులో బట్లర్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు తేడాతో గెలిచి రెండోసారి పొట్టి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ 49బంతుల్లో ఓ సిక్స్‌తో 52పరుగులు చేసి అజేయ హాఫ్‌సెంచరీతో ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2010లో పాల్ కాలింగ్‌వుడ్ సారథ్యంలో ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ తొలిసారి గెలవగా బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్ మరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈక్రమంలో ఒకేసారి వన్డే ప్రపంచకప్‌తోపాటు ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఏకైక జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 8వికెట్ల నష్టానికి చేసింది. నాలుగు ఓవర్లలో కేవలం 12పరుగులిచ్చి పడగొట్టిన సామ్‌కరన్ ధాటికి పాక్ జట్టు విలవిలలాడింది. పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని 5వికెట్లు కోల్పోయి 5వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై గెలిచి పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్ పేసర్ సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలను దక్కించుకున్నాడు.

మెల్‌బోర్న్ : టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్‌కీపర్ రిజ్వాన్ ప్రారంభించారు. 14బంతుల్లో సిక్సర్‌తో 15పరుగులు చేసిన రిజ్వాన్‌ను సామ్‌కరన్ అడ్డుకుని షాక్ ఇచ్చాడు. రిజ్వాన్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో పాకిస్థాన్ 29పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హరీస్ (8)కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లేలో పాకిస్థాన్ వికెట్ నష్టానికి చేసింది. ఈనేపథ్యంలో ఒంటరి పోరాటం చేస్తున్న కెప్టెన్ బాబర్‌ను అదిల్ రషీద్ బోల్తా కొట్టించాడు. 28బంతుల్లో 32పరుగులు చేసిన అదిల్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం ఇఫ్తికర్ అహ్మద్ (0)ను స్టోక్స్ డకౌట్ చేశాడు. 85పరుగుల వద్ద పాకిస్థాన్ నాలుగో వికెట్ పడింది.

ఈ దశలో మసూద్ జట్టు బాధ్యత తీసుకుని ఆదుకున్నాడు. 28బంతుల్లో వౌఫోర్లు, ఓ సిక్స్‌తో చేసిన మసూద్‌ను సామకరన్ పెవిలియన్‌కు పంపాడు. 121పరుగులు వద్ద ఐదో వికెట్ కోల్పోయిన తరువాత పాక్ ఇక కోలుకోలేకపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించడంతో వరద పారించలేకపోయింది. మొత్తంమీద 20ఓవర్లలో 137/8 స్వల్ప స్కోరు నమోదు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్‌కరన్ మూడు వికెట్లు తీయగా, అదిల్ రషీద్, క్రిస్‌జోర్డాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్టోక్స్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
పాక్‌ను దెబ్బతీసిన అఫ్రిది గాయం పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష ఛేదనలో ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పాక్ స్టార్ పేసర్ ఓపెనర్ అలెక్స్‌హేల్స్ (1)ను క్లీన్‌బౌల్డ్ చేసి పాక్‌కు శుభారంభాన్ని అందించాడు. ఫిలిప్ సాల్ట్ (10)ను రవూఫ్ ఔట్‌చేశాడు. కెప్టెన్ 3 బౌండరీలు, ఓ సిక్స్‌తో 26పరుగులు చేసి బౌలింగ్‌లోనే కీపర్‌క్యాచ్‌గా వెనుదిరిగాడు. ముగిసేసరికి 49పరుగుల కు 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని జట్టును విజయపథంలో నడిపించాడు. 49 బంతుల్లో సిక్సర్‌తో పరుగులు చేసి అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. స్టోక్స్‌కు బ్రూక్ (20), తమవం తు సహకారం అందించారు. బ్రూక్‌ను క్యాచ్ అందుకునే క్రమంలో అఫ్రిది గాయపడటంతో పాక్ విజయ అవకాశాలు దెబ్బతిన్నాయి. 19ఓవర్లలోనే 138/5తో లక్ష్యాన్ని ఛేదించి విశ్వవిజేతగా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News