Sunday, May 5, 2024

తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ హీరో విజయ్..

- Advertisement -
- Advertisement -

చెన్నై: తల్లిదండ్రులపై తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కేసు పెట్టారు. అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారని తల్లిదండ్రులతోపాటు మరో తొమ్మిది మందిపై విజయ్ కేసు పెట్టాడు.దీంతో ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపుతోంది. ఏడాది క్రితం విజయ్ పేరుతో ఆయన తండ్రి చంద్రశేఖర్ ‘విజయ్ మక్కల్ ఇయ్యకన్’ అనే పార్టీ పెట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా విజయ్ తల్లిదండ్రులు ఉన్నారు. అయితే, ఆ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదని గతంలోనే విజయ్ తెలిపారు. కానీ, తల్లిదండ్రులు తన పేరుతో పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని, తన అనుమతి లేకుండానే తన పేరును వాడుకుంటున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విజయ్ సిటీ కోర్టుకు వెళ్లాడు. అనుమతి లేకుండా తన పేరును వాడుకోకుండా ఆదేశాలివ్వాలని కోర్టును కోరాడు.

Tamil Actor Vijay complaint against his Parents

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News