Sunday, April 28, 2024

సముద్రమైన చెన్నై

- Advertisement -
- Advertisement -
Tamil nadu rains latest news
వీడని కుండపోత వానలు
14 మంది దుర్మరణం
పలు వీధులు చెరువులు
తీరం దాటిన వాయుగుండం
ఎపిలో భారీ వర్షాల కలకలం

చెన్నై : కుండపోత వానలు, దట్టమైన చీకట్ల మబ్బు పట్టిన వాతావరణంతో చెన్నై చితికిపోయింది. తీవ్రస్థాయి ఈదురుగాలులు, సముద్రంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఏకధాటిగా పడుతోన్న వర్షాలతో చెన్నై నగరం జలదిగ్బంధం అయింది. అల్పపీడన కొనసాగింపు క్రమంలో చెన్నైలో పలు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపొయ్యాయి. వర్ష సంబంధిత విధ్వంసకాండతో దాదాపు 14 మంది బలి అయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో జలాశయాలు పొంగిపొర్లాయి. పలు రిజర్వాయర్ల గేట్లు తెరిచారు. పలు జాగ్రత్త చర్యలు, ముందస్తు హెచ్చరికలతో నీటిని వదిలినప్పటికీ చెన్నై మహానగరంలో పలు ప్రాంతాలలోకి వరద నీరు ఉధృతస్థాయిలో వచ్చిచేరింది. పలువీధులు చెరువులను తలపిస్తున్నాయి. అడుగుల మేర బురద ఇసుక పేరుకుపోయింది. చెన్నై అంతా తేలియాడుతున్న వైనం కన్పించింది. వాయుగుండంగా మారిన అల్పపీడనం గురువారం చెన్నై వైపు సాగింది. ఇది భారీ వర్షాల ముప్పును తెచ్చిపెట్టింది.

తీరం దాటే క్రమంలో ఇది మరింతగా వర్షభీభత్సానికి దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు. చెన్నైవాసులు ఇంతకు ముందటి వర్షాలు వరదల పీడకలను ఎదుర్కోకుండా చేసేందుకు సిఎం స్టాలిన్ సూచనలతో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. అయితే వెనువెంటనే వరదల భీకర స్థితిని కంట్రోలులోకి తేవడం అసాధ్యమవుతోంది. సముద్రం పక్కన సముద్రంగా మారుతోన్న చెన్నై వీధుల నుంచి వరద నీటిని తోడివేసేందుకు అధికారులు భారీ స్థాయి మోటార్లను రంగంలోకి దింపారు. రోబోలను రంగంలోకి దింపారు. బురద మేటలను తొలిగిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాలు , సమీపంలోని వెలచెరి ఇతర శివార్లలో వరద నీటితో తలెత్తిన పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నారు. అయితే కుండపోత వానలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలడం, నీటిలో కొట్టుకుపోవడం వంటి ఘటనలు జరిగాయి. ఈ విధంగా ఇప్పటికే 14 మంది వరకూ మృతి చెందారని అధికార వర్గాలు తెలిపాయి.

అయితే పలు వీధులలో వర్షపు నీరు చేరుకుని ఉండటంతో కాలనీల ప్రజలు అంధకారంలో మగ్గుతూ నానా కష్టాలకు గురవుతున్నారు. కూవుమ్ నది పొంగిపొర్లుతోంది. శివార్లలోని క్రోమ్‌పేట్ సమీపంలోని హస్తినాపురం చుట్టుపక్కల వీధులన్ని కూడా నదిని తలపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ నడుం లోతు నీళ్లుచేరాయి. చెన్నైతో పాటు శివార్లలోని చెంగల్పట్, తిరువల్లూరు, కాంచీపురం ఇతర ప్రాంతాలలో కూడా వరదలు విలయానికి దారితీశాయి. పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి ఇరాయి అంబు ఇతరులు పాల్గొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకునేందుకు వెంటనే ఆరుగురు సభ్యుల మంత్రిత్వ బృందాన్ని సిఎం ఏర్పాటు చేశారు. ఇక వాయుగుండం ఇప్పుడు చెన్నై దాటింది. ఆంధ్రప్రదేశ్ వైపు సాగింది. ఎంపి తీర ప్రాంతం వైపు సాగుతూ ఉండటంతో ఇప్పటికే తమిళనాడు లోతట్టు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News