Friday, April 26, 2024

పది ఫలితాలపై ఉపాధ్యాయులు కుస్తీ….

- Advertisement -
- Advertisement -

ప్రత్యేక శ్రద్ద తీసుకుని పాఠాలు బోధిస్తున్న ప్రభుత్వ బడులు
మార్కులు తక్కువచ్చే విద్యార్థులకు రోజు వారీ పరీక్షలు
సాయంత్రం వరకు తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు
ఈసారి 90 శాతం ఉత్తీర్ణతకు ప్రణాళికలు సిద్దం చేసిన టీచర్లు

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో ఈవిద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పాఠశాలల ఉపాధ్యాయులు కుస్తీ పడుతున్నారు. ప్రతి ఏడాది విడుదల చేసే ఫలితాలు ఆశించిన స్దాయిలో రాకపోవడంతో ఈఏడాది ఫలితాల్లో ఎక్కువ శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు టీచర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రతిసారి విద్యశాఖ ఉన్నతాధికారుల నుంచి అక్షింతలు పడుతున్నాయి. దీంతో ఈసారి చాలెంజ్‌గా తీసుకుని సబ్జెక్టులో వెనకబడిన విద్యార్థుల కోసం రోజువారీగా టెస్టులు పెడుతూ మార్కులు సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. చదువులకు ఇబ్బందులు కాకుండా సర్కార్ స్కూళ్లో విద్యుత్, తాగునీరు, బెంచీలు,బోర్డు ఏర్పాటు చేసి రీడింగ్ చేయిస్తున్నారు.

ఈసారి విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు. ప్రతి పాఠశాల్లో 90శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాంటున్నారు. ఇప్పటికే అన్ని సబ్జెక్టులు పూర్తి చేసి, ఈనెల రివిజన్ తరగతులకు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా సర్కార్ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాల తగ్గేవి, ఈవిద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, ఇదే తరహాలో ప్రభుత్వ బడుల వైపు విద్యార్ధులు మొగ్గుచూపేందుకు పదిలో ఫలితాలు పెరిగితే ఇంకా పెద్ద ఎత్తున ఆడ్మిషన్లు పెరుగుతాయని సిబ్బంది అంటున్నారు.

అదే విధంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం ప్రభుత్వం పాఠశాల్లో ప్రారంభించడంతో పదోతరగతి ఫలితాల్లో దూసుకపోతే విద్యార్ధుల సంఖ్య సర్కార్ బడుల్లో గణనీయంగా పెరుగుతుందని ప్రధానోపాధ్యాయులు భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్‌లో ప్రభుత్వ పాఠశాల్లో 8200 మంది, రంగారెడ్డి జిల్లాలో 10,600 మంది, మేడ్చల్ జిల్లాలో 9845 మంది, ప్రైవేటు స్కూళ్లలో 1.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వీరందరు కళాశాల చదువులు చదివేలా తమ అనుభవంతో పాఠాలు బోధించి ఈసారి ప్రకటించే పదోతరగతి ఫలితాల్లో ముందు జాబితాలో ఉంటామని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News