Monday, April 29, 2024

భారత్‌కు ఎదురుందా?

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌కు సవాల్!
నేటి నుంచి చివరి టెస్టు

ధర్మశాల : ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. గురువారం నుంచి ధర్మశాల వేదికగా జరిగే ఆఖరి టెస్టు మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు శుభంకార్డు పడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న టీమిండియా.. ఆఖరి టెస్టులోనూ గెలుపొంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(డబ్లుటిసి) 2023-25 పాయింట్స్ టేబుల్ తమ అగ్రస్థానాన్ని మరింత పదిలంగా ఉంచుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. మరోవైపు చివరి టెస్టులోనైనా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. దాంతో ధర్మశాల టెస్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకోని ప్రాక్టీస్ ప్రారంభించాయి. విజయమే లక్ష్యంగా చెమటోడ్చుతున్నాయి. దీంతో ఐదో టెస్టులో ఇరుజట్లు మధ్య తీవ్ర పోరు ఖాయంగానే కనిపిస్తోంది.

టీమిండియా జోరు..

ఇక టీమిండియా ఎక్స్‌ట్రా పేసర్‌కు బదులు స్పిన్నర్‌తో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. నాలుగో టెస్ట్‌కు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులోకి రావడంతో యువ పేసర్ ఆకాశ్ దీప్‌పై వేటు పడే అవకాశం ఉంది. రాంచీ టెస్ట్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆకాశ్ దీప్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి టీమిండియా గెలుపులో కీలక భూమిక పోషించాడు. ఇలా కాకుండా కుల్దీప్ యాదవ్ కోసమైనా ఆకాశ్‌ను పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ పేస్ పిచ్‌ను రెడీ చేస్తే మాత్రం మూడో పేసర్‌గా ఆకాశ్‌దీప్ బరిలోకి దిగుతాడు. బ్యాటింగ్ విభాంగలో రోహిత్ శర్మకు విశ్రాంతి ఇస్తారనే వార్తల్లో వాస్తవం లేదని విషయం స్పష్టమైంది. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా రజత్ పటీదార్‌పై వేటు వేస్తారా? లేక మరో అవకాశం ఇస్తారా? అనేది చూడాలి. ఒకవేళ వేటు వేస్తే మాత్రం దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేస్తాడు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు. ఇక ఏది ఏమైనా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ బలంగా కనిపిస్తోంది. అంతకన్నా తొలి మ్యాచ్‌లో ఓడి వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆత్మవిశ్వాసంతో టీమిండియా జోరుమీదుంది.

ఆత్మగౌరవం కోసం..

ఇప్పటికే 1-3తో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్.. చివరి టెస్టులోనైనా గెలిచి గౌరవంగా భారత పర్యటనను ముగించాలనుకుంటోంది. ఇక ఈ టెస్టు మ్యాచ్ జరిగే ధర్మశాల పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. అదే జరిగితే ఇంగ్లండ్‌కు అడ్వాంటేజ్‌గా మారనుంది. పేస్ పిచ్‌ను అంచనా వేస్తున్న ఇంగ్లండ్.. అందుకుతగ్గట్లుగానే ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగింది. బెన్ స్టోక్స్ ఎక్స్‌ట్రా పేసర్‌గా బరిలోకి దిగనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు షోయబ్ బషీర్, టామ్ హార్ట్‌లీ ఇద్దరినీ ఆడించనుంది ఇంగ్లండ్ టీమ్ మమేనేజ్‌మెంట్. వీరికి తోడుగా జోరూట్ స్పిన్ బాధ్యతల పంచుకోనున్నాడు. అయితే బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ ఎలాంటి మార్పులకు పోలేదు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న జానీ బెయిర్ స్టోనూ చివరి టెస్టుకు జట్టులో కొనసాగనున్నాడు. కాగా, ధర్మశాల బెయిర్‌మ స్టో కెరీర్‌లో 100వ మ్యాచ్ కావడం విశేషం. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలి పోప్, జోరూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తోంది. మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్ పేస్ బౌలర్లు సయితం ఈ టెస్టులో రాణించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
తుది జట్లు అంచనా..

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, దేవదత్ పడిక్కల్/ రజత్ పాటిదార్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలి పోప్, జోరూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్‌లీ, మార్క్‌వుడ్, జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News