Saturday, May 4, 2024

సిరీస్ మనదే

- Advertisement -
- Advertisement -

Team India won in second T20 match against Australia

 

రెండో టి20లో ఆసీస్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం

రాణించిన ధావన్, చెలరేగిన హార్దిక్ n ఉత్కంఠ పోరులో భారత్
విజయం n మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం

సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టుతో సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా ఉత్కంఠనడుము ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది, కీలకంగా మారిన చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా రెండు సిక్స్‌లతో చెలరేగడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టీమిండియాను విజయం వరించింది. ఈ గెలుపుతో టి20 సిరీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సొంతమైంది. ఆసీస్ చేతిలో వన్డే సిరీస్‌నుల్లోయిన కోహ్లీ సేన టి20 సిరీస్‌ను దక్కించుకునిప్రతీకారం తీర్చుకున్నట్లయింది.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 195 పరుగులు భారీ లక్షంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు కెఎల్ రాహుల్ (30),శిఖర్ ధావన్(52) శుభారంభాన్ని అందించారు. 22 బంతుల్లో 30 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్న రాహుల్ ఆండ్రూ టై బౌలింగ్‌లో స్వెప్సన్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. రాహుల్ త్వరగా ఔటయినప్పటికీ వీరిద్దరూ ఆరు ఓవర్లలో 60 పరుగులు జోడించి మంచి ప్రారంభాన్ని అందించారు. 36 బంతుల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో అర్ధసెంచరీ చేసి మంచి ఊపుమీదున్న ధావన్ అర్ధసెంచరీ పూర్తయిన కొద్ది సేపటికే జంపా బౌలింగ్‌లో స్వెప్సన్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సంజూ శాంసన్ 10 బంతుల్లో 15 పరుగులు చేసినప్పటికీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక పోయాడు. మరో వైపు కోహ్లీ దూకుడు పెంచి లక్షాన్ని తగ్గించసాగాడు.

24 బంతుల్లో రెండు సిక్స్‌లు, మరో రెండు ఫోర్లతో 40 పరుగులు చేసిన కోహ్లీని డేనియల్ సామ్స్ బోల్తా కొట్టించడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ రాగానే బ్యాట్ ఝళిపించడంతో భారత్ విజయ సమీకరణం రెండు ఓవర్లలో 25పరుగులుగా మారింది. అనంతరం హార్దిక్ విధ్వంసం సృష్టించాడు. సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగి పోయాడు. చివరి ఓవర్‌లో విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా రెండు సిక్సర్లు బాది మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. ఆఖరి రెండు ఓవర్లు పాండ్యనే స్ట్రైకింగ్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా, స్వెప్సన్, ఆండ్రూ టై, డేనియల్ తలా ఒక వికెట్ తీశారు.

రాణించిన వేడ్

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. షార్ట్(9) తక్కువ స్కోరుకే ఔటయినప్పటికీ వేడ్ దూకుడుగా ఆడడంతో ఆ జట్టు పవర్‌ప్లేలో 59 పరుగులు చేసింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. అయితే 8వ ఓవర్‌లో కోహ్లీ అతడ్ని రనౌట్ చేయడంతో ఆసీస్ పరుగుల వేగం కాస్త మందగించింది.

అనంతరం మాక్స్‌వెల్ (13 బంతుల్లో 22 పరుగులు)తో కలిసి స్టీవ్ స్మిత్ (38 బంతుల్లో 46 పరుగులు) అడపాదడపా బౌండరీలు బాదడంతో ఆసీస్ 11 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయిని దాటింది. అయితే ఈ దశలో భారత బౌలర్లు పుంజుకొని క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆసీస్ స్కోరును కట్టడి చేశారు. కానీ చివర్లో హెన్రిక్స్(18 బంతుల్లో 26), స్టోయినిస్ (7 బంతుల్లో16 పరుగులు నాటౌట్) బ్యాట్ ఝళిపించడంతో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నటరాజన్ రెండు, శారూల్, చాహల్ చెరో వికెట్ తీశారు. కాగా 22 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన హార్దిక్ పాండ్య ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.

అరుదైన రికార్డు

ఈఈ విజయంతో భారత్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. టి20 సిరీస్‌లో భారత్‌కు ఇది వరసగా ఐదోసిరీస్ విజయం. అలాగే తమ వరస విజయాల సంఖ్యను 11 మ్యాచ్‌లకు పెంచుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News