Sunday, May 5, 2024

రెవెన్యూ చట్టం నూతన అధ్యాయానికి శ్రీకారం

- Advertisement -
- Advertisement -
Telangana Assembly Passed New Revenue Act Bill 2020
రాష్ట్ర మంత్రులు కొప్పుల, సత్యవతి, శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: భూవివాదాలకు పరిష్కారం చూపుతూ, భూమిపై భద్రత కల్పిస్తూ ముఖ్యమంత్రి నూతన రెవెన్యూ చట్టం రూపొందించి సభలో ప్రవేశపెడితే కాంగ్రెస్, బిజెపి అడ్డుకోవాలని ప్రయత్నించాయని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. అయితే వారిప్రయత్నాలు ఫలించలేదని మంత్రులు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన ఈచట్టానికి కోట్లాది ప్రజల మద్దతు లభించడంతో విపక్షాలు నోరు మూసుకున్నాయన్నారు. నూతన రెవెన్యూ చట్టం తెలంగాణ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టుతుందని చెప్పారు. భూ వివాదాలకు పరిష్కారం చూపుతూ, భూమిపై భద్రత కల్పిస్తూ సిఎం కెసిఆర్ రూపొందించిన ఈ చట్టం దేశానికే ఆదర్శం అన్నారు.

శుక్రవారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసకువచ్చిందని చెప్పారు. భూ వివాదాలు సత్వర పరిష్కారంతో పాటు అవినీతికి అవకాశం లేని విధంగా చట్టం ఉందన్నారు. పేదలకు, సామాన్యులకు, రైతులకు ఈ చట్టం లాభం చేకూరుస్తుందన్నారు. ఈ చట్టంతో దేశం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. విఆర్‌ఎలను రెగ్యులరైజ్ చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భూమి కోసం కుటుంబ తగాదాలు, అన్నదమ్ములను, తల్లిదండ్రులను చంపిన సందర్భాలు కూడా ఉన్నాయని చ్పెపారు. నూతన రెవెన్యూ చట్టంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉందో ఈ రోజు కూడా అంత సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.

ఈ చట్టం అమలైతే దేశవ్యాప్తంగా సిఎం కెసిఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని కాంగ్రెస్, బిజెపి రాజకీయం చేసేందుకు ప్రయత్నించాయన్నారు. గత ఆంధ్రపాలకులు భూముల సర్వేపై నిర్లక్షంగా వ్యవహరించడంతో ఇప్పటి వరకు వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూముల రికార్డులు సక్రమంగా లేవన్నారు. నూతన రెవెన్యూ చట్టం మేరకు భూముల డిజిటల్ సర్వే చేసి రికార్డులు రూపొందించే అవకాశాలు ఉన్నాయన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న భూసమస్యలకు నూతన చట్టం ద్వారా పరిష్కారం దొరికిందన్నారు. నూతన చట్టం ప్రవేశపెట్టిన సిఎం కెసిఆర్‌కు రైతుల పక్షాన, దళితుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇష్టపడి సిఎం కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. పోడుభూముల పరిష్కారం నేనే స్వయంగా చేస్తానని సిఎం కెసిఆర్ సభలో ప్రకటించడం ఎంతో గొప్పవిషయమన్నారు. ఈ మీడియా సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, శాసనమండలిసభ్యుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News