Friday, April 26, 2024

కాసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Telangana Assembly Session To Begin Shortly

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11:30గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో నాలుగు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బిల్లుల ఆమోదం తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడనుంది. రేపు శాసనమండలి సమావేశం జరగనుంది. ఇవాళ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులపై రేపు కౌన్సిల్ లో చర్చ జరగనుంది. జిహెచ్ఎంసిలో 50 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు, 2016లో అమలులో ఉన్న రిజర్వేషన్లు కొనసాగింపు, స్టాంప్ డ్యూటీ చెల్లించే సమయంలో భూముల విలువల నిర్ధారణలో రిజిస్ట్రార్ కి ఉన్న విచక్షణాధికారాలు తొలగింపు చట్ట సవరణ, వ్యవసాయ భూములను వ్యవసాయేతరాలను మార్పుచేసే అధికారం ఆర్డీవో నుంచి తాహశీల్దార్ కు బదలాయింపు, హైకోర్టు సూచన మేరకు నిందితుల పూచీకత్తు అంశంపై సీఆర్పీ చట్ట సవసరణ వంటి బిల్లులను సర్కార్ సభలో ప్రవేశపెట్టనున్నారు.

Telangana Assembly Session To Begin Shortly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News