Saturday, April 27, 2024

మరో 1802 కేసులు

- Advertisement -
- Advertisement -

Telangana corona positive cases update
జిహెచ్‌ఎంసిలో 245, జిల్లాల్లో 1557 కేసులు
వైరస్ దాడిలో మరో 9 మంది మృతి
1,42,771కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య
హెల్త్ డైరెక్టర్‌ను పరామర్శించిన మంత్రి ఈటల

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 1802 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్‌ఎంసి పరిదిలో 245 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 16, భద్రాద్రి 49,జగిత్యాల 73, జనగాం 30, భూపాలపల్లి 1, గద్వాల 17, కామారెడ్డి 46, కరీంనగర్ 136,ఖమ్మం 64, ఆసిఫాబాద్ 13,మహబూబ్‌నగర్ 40 , మహబూబాబాద్ 63, మంచిర్యాల 44, మెదక్ 10, మేడ్చల్ మల్కాజ్‌గిరి 65, ములుగు 11, నాగర్‌కర్నూల్ 29, నల్గొండ 79,నారాయణపేట్ 2, నిజామాబాద్ 94, పెద్దపల్లి 32,సిరిసిల్లా 20, రంగారెడ్డి 158, సంగారెడ్డి 103, సిద్ధిపేట్ 106, సూర్యాపేట్ 62, వికారాబాద్ 12,వనపర్తి 25, వరంగల్ రూరల్ 21, వరంగల్ అర్బన్ లో 93, యాదాద్రిలో మరో 29 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.

అదే విధంగా వైరస్ దాడిలో మరో 9 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,42,771కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 1,10,241కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 31,635 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 24,596 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 895కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 33 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా, 1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ఆదివారం 36,593 మందికి టెస్టులు..
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు వేగంగా జరుగుతున్నాయి. ఆదివారం చేసిన 36,593 టెస్టులు కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 17,66,982 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంటే ప్రతి పది లక్షల్లో 47,594 చొప్పున పరీక్షలు జరిగాయని హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తేలిన పాజిటివ్‌లలో 98,512 మందికి ఎలాంటి లక్షణాలు లేకుండా వైరస్ సోకితే, మరో 44,259 మందికి లక్షణాలతో వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఆదివారం చేసిన పరీక్షల్లో 16,467 మంది ప్రైమరీ, 5123 సెకండరీ కాంటాక్ట్‌లు ఉన్నట్లు వైద్యశాఖ పేర్కొంది.

హెల్త్ డైరెక్టర్‌ను పరామర్శించిన మంత్రి ఈటల..
హెల్త్‌డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తండ్రి సూర్యనారాయణరావు మరణం పట్ల మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోమవారం ఫోన్లో పరామర్శించిన మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సూర్యనారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటునట్లు మంత్రి ప్రకటించారు.

Telangana corona positive cases update
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News