Sunday, April 28, 2024

జలదిగ్బంధంలో జంట నగరాలు

- Advertisement -
- Advertisement -

Telangana Govt declared two days holidays

హైదరాబాద్: నగరంలో నిన్న కురిసిన భారీవర్షానికి జంట నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒక్కరోజులోనే 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో విద్యుత్, టెలిఫోన్, ఇంటర్ నెట్, సేవలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లో ఆన్ లైన్ క్లాసులకు సర్కార్ ఇవాళ, రేపు సెలవులు ప్రకటించింది. ఈ రెండు రోజులు పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు కూడా సెలవులు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ లో వరద ఉద్ధృతి కారణంగా పలువురు గల్లంతయ్యారు. బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. పాతబస్తీ గౌన్ నగర్ లో 10 ఇళ్లు కూలిపోయాయి. ఈ వర్షాలతో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా.. మరో 15 మందికి పైగా చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు చిన్నారు ఉన్నట్టు సమాచారం. సిటీలో సగం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్టు అధికారులు తెలిపారు.

Telangana Govt declared two days holidays

Telangana Govt declared two days holidays

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News