Saturday, May 4, 2024

శోభానాయుడు మృతిప‌ట్ల సిఎం సంతాపం

- Advertisement -
- Advertisement -

CM KCR mourns the death of Shobha Naidu

హైదరాబాద్: ప్రముఖ కూచిపూడి కళాకారిణి, నృత్య అధ్యాపకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభానాయుడు (64) బుధవారం ఉదయం కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజుల నుండి ఆమె వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందించినట్టు కుటుంసభ్యులు తెలిపారు. ఆమె మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం తెలిపి, శోభానాయుడు కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి ప్రకటించారు. కూచిపూడి క‌ళానృత్యంలో శోభానాయుడు అసాధార‌ణ క‌ళాకారిణి అని, సత్యభామ, పద్మావతి ప్రాత్రలకు ఆమె నృత్యకళ ద్వారా సజీవంగా నిలిపారని సిఎం గుర్తుచేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో వెంకటనాయుడు, సరోజినీ దేవి దంపతులకు 1956లో శోభానాయుడు జన్మించారు. ఆమె చిన్నప్పటి నుంచి కూచిపూడిని అభ్యసించారు. దేశవిదేశాల్లో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపుతెచ్చుకున్నారు. ఆమె సేవలను గుర్తించిన భారతప్రభుత్వం 2001లో ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News