Wednesday, May 8, 2024

ఎస్ఇసి సర్క్యులర్‌ ను కొట్టివేసిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

Telangana High Court quashes SEC circular

హైదరాబాద్: ఎస్ఇసి గురువారం రాత్రి జారీ చేసిన సర్క్యులర్ ను హైకోర్టు కొట్టేసింది. స్వస్తిక్ మద్రతో పాటు బ్యాలెట్ పేపర్ పై ఏ గుర్తు ఉన్నా దాన్ని ఓటుగా పరిగణించాలని ఇసి సర్క్యులర్ ఇచ్చింది. ఎస్ఇసి సర్క్యులర్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో బిజెపి హౌజ్ మోషన్ పిటిషన్ వేసింది. దీంతో స్వస్తిక్ ముద్ర ఉన్న ఓట్లే చెల్లుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. గెలుపోటముల దగ్గర మార్కింగ్ ఉంటే తుది ఉత్తర్వులకు లోబడి ఫలితాలు వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. స్టాంపు, టిక్ పెట్టిన ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని ఆదేశించింది. ప్రత్యేకంగా లెక్కించిన ఓట్ల కంటే మెజార్టీ ఎక్కువగా ఉంటే ఫలితం ప్రకటించొచ్చని సూచించింది. ప్రత్యేకంగా లెక్కించిన ఓట్ల కంటే మెజార్టీ తక్కువగా ఉంటే ఫలితం నిలిపివేయాలని పేర్కొంది. గ్రేటర్ లో అన్ని చోట్లా తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు మొదలైంది.

Telangana High Court quashes SEC circular

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News