Sunday, April 28, 2024

స్థానిక చరిత్రలను ఎప్పటికప్పుడు చరిత్రకారులు వెలికితీయడం అభినందనీయం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్

Telangana history in Telugu

మనతెలంగాణ/హైదరాబాద్:  స్థానిక చరిత్రలను ఎప్పటికప్పుడు చరిత్రకారులు వెలికితీస్తూ భావితరాలకు వాటిని తెలియచేస్తున్నారని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ juluri gowri shankarప్రశంసించారు. ఆదివారం సాయంత్రం జూమ్ వేదిక ద్వారా చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ రచించిన ‘ఇంద్రదేశం’ ఒక పురాతన చారిత్రక సందేశం అనే పుస్తకాన్ని గౌరీశంకర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు విస్మరించిన తెలంగాణ చరిత్రను వెలికితీసేందుకు జరుగుతున్న కృషికి నిదర్శనంగా రామోజు రచనలున్నాయన్నారు. తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద ఎంత గొప్పదో ఇంద్రేశం ద్వారా ఈతరం చేతికి అందచేయడం అభినందించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఉన్న స్థానిక చరిత్రల ఆధారంగా బృహత్ చరిత్రకు శ్రీకారం చుడుతున్నామన్నారు. నేటి చరిత్రకారులు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పేరున అన్ని గ్రామాల చరిత్రలను సునిశతంగా పరిశీలిస్తున్న దానిలో భాగంగానే ఇంద్రేశం గ్రామ చరిత్ర వెలుగు చూసిందన్నారు.

చరిత్రలను రికార్డు చేయాల్సిన అవసరం ఉంది

ఈ కోణంలో బృందాలుగా ఏర్పడి తెలంగాణ జిల్లాల, మండలాల, స్థానిక గ్రామ చరిత్రలను రికార్డు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కోణంలోనే రామోజు హరగోపాల్ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెర్వు మండలంలోని ఇంద్రదేశం తదితర గ్రామాల చరిత్రను తవ్విస్తున్నారని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలోని గ్రామ నామాలను పరిశీలిస్తే శైవం ఈ నేలలో ఎంతో బలంగా ఉందో తెలుస్తుందన్నారు. శాసనాల ద్వారా స్థానిక చరిత్రను రికార్డు చేయడం శాస్త్రీయమయ్యిందన్నారు.

పటాన్‌చెరు నుంచి ఆవేరు దాకా, కొలనుపాక నుంచి వరంగల్ దాకా దారి పొడవునా లభిస్తున్న శాసనాలను చూస్తే ఇక్కడ జైనం, శైవం, బౌద్ధం విలసిల్లాలని చరిత్ర చెబుతుందని జూలూరు విశ్లేషించారు. ఈ జూమ్ సమావేశానికి చరిత్రకారుడు బ్రహ్మచారి అధ్యక్షత వహించగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ, హెరిటేజ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, ఎండి గంగాదేవి, ఆర్కెలాజికల్ కన్సల్టెంట్ రుషికేష్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కెమికల్ ఇంజనీర్, చరిత్రకారుడు భాస్కరుని వెంకట భదర్ గిరిశ్, కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు శ్రీరామోజు హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News