Wednesday, May 1, 2024

సారీ చెప్పిన హోంమంత్రి..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న హోంమంత్రి మహమూద్‌అలీ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మంత్రి తలసాని కోసం తెచ్చిన బొకే సమయానికి ఇవ్వలేదని హోం మంత్రి మహమూద్ అలీ తన వద్ద పనిచేస్తున్న కానిస్టేబుల్(గన్‌మెన్) చెంప చెళ్లుమనిపించాడు. ఈ సంఘటన అమీర్‌పేట డికె రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ అమీర్‌పేటలోని డికె రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు.

శుక్రవారం మంత్రి తలసాని పుట్టిన రోజు కావడంతో హోమంత్రి మహమూద్ అలీ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత బోకే ఎక్కడ అని తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. తనకు బోకే గురించి తెలియదని సిబ్బంది చెప్పడంతో సహనం కోల్పోయిన హోంమంత్రి మహమూద్‌అలీ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టారు. తర్వాత వెనుక ఉన్న వారు మంత్రి మహమూద్ అలీకి బోకే అందించారు. దానిని హోంమంత్రి మహమూద్‌అలీ మంత్రి తలసానికి అందించారు. తన వద్ద పనిచేస్తున్న సిబ్బందిపై హోంమంత్రి చేయిచేసుకోవడంపై పలు సంఘాలకు చెందిన బాధ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హోంమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News