Sunday, April 28, 2024

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల్లో విశ్వాసాన్ని నింపిన తెలంగాణ పోలీసులు

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్లరూరల్: దేశంలో అత్యుత్తంగా శాంతి భద్రతలను కాపాడుతూ తెలంగాణ పోలీసులు ఆదర్శంగా నిలిచారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ శతాబ్ది దినోత్సవంలో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్‌స్టేషన్ పరిసర ప్రాంతాలు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యే సమయంలో శాంతిభద్రతలు తప్పడం, నక్సలిజం పెరుగుతుందనే ఆపోహాలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పోలీస్ శాఖ పటాపంచలు చేసిందన్నారు. దేశంలోనే అత్యుత్తంగా శాంతిభద్రతలను కాపాడుతూ తెలంగాణ పోలీసులు ఆదర్శంగా నిలిచారన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించామన్నారు. నూతన పోలీస్ నియామకాలల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలందించాలని, యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు పోలీస్ వ్యవస్థను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఎసిపి ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో పోలీస్ వ్యవస్థకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ కల్పించామని, రాజకీయ జ్యోక్యాన్ని తగ్గించామని, పోలీస్ శాఖ అమలు చేస్తున్న నూతన విధానాల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ఏళ్లలో క్రైమ్ రేట్ తగ్గిపోయిందన్నారు. దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న సీసీ కెమెరాల్లో డ్బ్బై శాతం తెలంగాణలో ఏర్పాటు చేసి పటిష్ట నిఘా పెట్టారన్నారు.

ఈకార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు హయూమ్, ప్రదీప్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఒ రాజ్‌కుమార్, ముడిమ్యాల పిఎసిఎస్ చైర్మన్ గోనె ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాములు, ఒబిసి సెల్ మండల అధ్యక్షులు సూర్యాపేట శ్రీనివాస్‌గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్ నత్తి క్రిష్ణారెడ్డి, నాయకులు రవీందర్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News