Saturday, May 4, 2024

తెలంగాణకు మరో ఫస్ట్

- Advertisement -
- Advertisement -

Telangana ranks first in India in warehouse occupancy

 

గిడ్డంగుల ఆక్యుపెన్సీలో
ప్రథమ స్థానం
లాభాల్లో రూ.5 కోట్ల
చెక్కును మంత్రి నిరంజన్‌రెడ్డికి
అందజేసిన అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం గిడ్డంగుల సంస్థ ఆక్యుపెన్సీలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. వేర్ హౌసింగ్ లాభాల నుండి రూ.5 కోట్ల డివిడెండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించింది. 2019 – 2020 సంవత్సరంలో సొంతగా 27 గోడౌన్లు, అలాగే మార్కెట్ కమిటీవి 194, ఇన్వెస్టర్ గోడౌన్స్ 54, ప్రైవేటు గోడౌన్లు ఐదింటిని వినియోగించుకుంది. కాగా మొత్తం 280 గోడౌన్లలో 22.88 లక్షల మెట్రిక్ టన్నుల సరుకుల నిల్వతో 102 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. దీనికి గానూ రూ.83.12 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.5 కోట్ల చెక్కును రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సోమవారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు , ఎంజి భాస్కరాచారి, ఎస్‌ఈ సుధాకర్ రెడ్డి తదితరులు కలిసి అందజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News