Thursday, May 2, 2024

రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana reports 100 new corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు 100కు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 13,920 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…116 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,93,907కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 43 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,89,065 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.39 శాతంగా నమోదైంది. మరో 608 మంది ఫలితాలు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 731 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా కొత్తగా 83 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Telangana reports 100 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News