Sunday, April 28, 2024

సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ (52) మృతిచెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో చేరి చికిత్సపొందుతున్న ఆయన కన్నుమూశారు. నర్సింగ్ యాదవ్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300 సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. క్షణక్షణం, ముఠా మేస్త్రీ, శంకర్ దాదా ఎంబిబిఎస్, ఠాగూర్, మాస్టర్, పోకిరి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఇడియట్, యమదొంగ, అన్నవరం తదితర చిత్రాల్లో ఆయన ప్రముఖ పాత్రల్లో నటించారు. కామెడీ, విలన్ పాత్రల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

ఇక 1968 సంవత్సరం జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు నర్సింగ్ యాదవ్. ‘హేమా హేమీలు’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయనకు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బ్రేక్ ఇచ్చారు. వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘క్షణక్షణం’లో నటించి ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. నర్సింగ్ యాదవ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Telugu Actor Narsing Yadav died

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News