Sunday, April 28, 2024

సెప్టెంబర్ 25, 26 తేదీల్లో టొరంటోలో ‘తెలుగు సాహితీ సదస్సు’

- Advertisement -
- Advertisement -

టొరంటో: సెప్టెంబర్ 25, 26(శనివారం, ఆదివారం) తేదీల్లో కెనడాలోని టొరంటోలో ‘మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు, 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు’ ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశాలు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, తెలుగు తల్లి పత్రిక, ఆటవా తెలుగు అసోసియేషన్‌, అంటారియో తెలుగు ఫౌండేషన్‌, టొరంటో తెలుగు టైమ్స్‌, కాల్గరి తెలంగాణ అసోసియేషన్‌, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ టొరంటో, తెలుగు వాహిని సాహిత్య సమూహం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.

ఈ ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశానికి ఏర్పాట్లు త్వరితగతిని జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
మా ఆహ్వానాన్ని మన్నించి సుమారు 100 మంది అమెరికా-కెనడా సాహితీవేత్తలు ఎంతో ఉత్సాహంగా స్పందించి ప్రసంగ ప్రతిపాదనలని తమకు పంపించడం ఎంతో సంతోషాన్ని కలగజేస్తోందని తెలిపారు. ఆయా వక్తలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. అందరికీ అవకాశం కలిగించడానికి సదస్సు రెండు రోజులూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మొత్తం 20 గంటలకి పైగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
టొరాంటో ప్రధాన కేంద్రంగా జరిగే ఈ రెండు రోజుల ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ యూట్యూబ్‌ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ప్రపంచంలో అతి పెద్ద దేశాలయిన కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి ఇంత పెద్ద ఎత్తున తమదే అయిన ఒక సాహిత్య వేదిక మీద కలుసుకోవడం ఇదే మొదటి సారని చెప్పారు. ఈ సదస్పుకు సంబంధించిన సమగ్ర కార్యక్రమం, ప్రసంగాల వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఈ సదస్సు గురించి కెనడాలో ఉంటున్న తెలుగు యువతులు హర్ష దీపిక రాయవరపు, భావన పగిడేలా ప్రత్యేక వీడియోలో వివరించారు. ఈ కార్యక్రమం సంబంధించిన విషయాల కోసం సంచాలకులు లక్ష్మీరాయవరపు, కార్యనిర్వాహక సంఘం సభ్యులు యామిని పాపుదేశి, భావన పగిడేల, సర్దార్‌ఖాన్‌, కృష్ణ కుంకాల, వంగూరి చిట్టెన్ రాజు,  సంధాన కర్తలు విక్రమ్ సింగరాజు, శాయి రాచకొండలను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

Telugu Sahitya Summit on Sept 25 in Canada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News