Wednesday, May 1, 2024

‘మిస్టర్ ప్రెగ్నెంట్’గా సోహైల్

- Advertisement -
- Advertisement -

‘బిగ్ బాస్’ ఫేమ్, యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ కొత్త సినిమాకు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను చిత్ర బృందం ప్రకటించింది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెబుటెంట్ శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. అతని పాత్ర, కథాంశం విభిన్నంగా ఉంటాయి. పిల్లలకూ, పెద్దలకూ నచ్చేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు నటిస్తున్నారు.

Bigg boss fame Sohel starrer in ‘Mister Pregnant’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News