Sunday, April 28, 2024

ప్రపంచకప్‌కన్నా టెస్టు క్రికెటే ముఖ్యం

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: టెస్టు క్రికెట్‌కే తన తొలి ప్రాధాన్యత అని, అందుకోసం అవసరమైతే టి20 ప్రపంచకప్‌ను సైతం వదులలుకుంటానని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఇటీవల మోచేతికి గాయమైన అతను నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు. అయితే తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్‌సైట్‌తో మాట్లాడాడు. ‘ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం నేను బాగా కోలుకుంటున్నా. అయితే అది నిదానంగా జరుగుతోంది. నేను కచ్చింగా టి20 ప్రపంచకప్ టోర్నీలో ఉండాలని అనుకుంటున్నా. కానీ నా వ్యక్తిగత కోణంనుంచి ఆలోచిస్తే టెస్టు క్రికెట్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తా. అలా యాషెస్ సిరీస్ వరకు పూర్తి ఫిట్‌నెస్ సాధించి గతంలో ఈ సిరీస్‌లో ఎలా ఆడానో ఇప్పుడూ అలానే ఆడాలని అనుకుంటున్నా. అలాంటి ప్రదర్శనతో నన్ను నేను అత్యున్నత స్థాయిలో చూడాలనుకుంటున్నా. ఈ నేపథ్యంలో ఒక వేళ ప్రపంచకప్‌లో ఆడకపోయినా పరవాలేదు. కానీ పరిస్థితులు అంతవరకు రావనే అనుకుంటున్నా’ అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

Test Cricket my main goal: Steve Smith

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News