Monday, May 6, 2024

ఆ పరిహారం సరిపోదు

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్ హింసాత్మక ఘటనపై అసదుద్దీన్

మన తెలంగాణ / హైదరాబాద్ : కశ్మీర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ) కస్టడీ హింసను ప్రోత్సహిస్తోందని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి అన్నారు. ఇటీవల భారత ఆర్మీకి చెందిన జవాన్లు ముగ్గురు పౌరులపై జరిగిన దారుణమైన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 27 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు గల ముగ్గురు వ్యక్తులు శుక్రవారం అనుమాస్పద పరి పరిస్థితులలో‘ చనిపోయారు. పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మరణించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుందని భావిస్తున్నారు. కాగా జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ డిసెంబర్ 23న పూంచ్ జిల్లాలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ జరిగిన ప్రదేశంలో చనిపోయిన ముగ్గురు పౌరుల బంధువులకు పరిహారం, ఉద్యోగాలను ప్రకటించింది.

దీనిపై స్పందించిన అసదుద్దీన్ ఆ పరిహారం సరిపోదని అన్నారు. దోషులను పౌర చట్టాల ప్రకారం విచారించి శిక్షించాలని అన్నారు. ఆర్మీ జవాన్లు ముగ్గురిని బట్టలు విప్పి, కారం పొడి చల్లిన 29 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని ఒవైసి తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News