Friday, May 3, 2024

బీహార్ ప్రభుత్వం కూలిపోవచ్చు !

- Advertisement -
- Advertisement -

BJP and JD(U)

బిజెపి, జనతాదళ్(యు) మధ్య చీలిక?…

పాట్నా: అందరూ అనుకుంటున్నట్లు బిజెపి, జనతాదళ్(యు) మధ్య ఎలాంటి చీలిక లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం చెప్పినప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం బీహార్‌లో ఏ క్షణమైనా ప్రభుత్వం కూలిపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. జెడి(యు) త్వరలో బిజెపి నుంచి వేరుకావొచ్చని కూడా అనుకుంటున్నారు. అంతేకాక తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జెడి), లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని కూడా అభిజ్ఞవర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమావేశం కావొచ్చని న్యూస్ 18 కూడా నివేదించింది. బిజెపితో ఖంగుతిన్న జెడి(యు) మంగళవారం తమ పార్టీ ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలతో పార్లమెంటరీ సమావేశాన్ని కూడా నిర్వహించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి నితీశ్ కుమార్ గైర్హాజరు అయిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది అని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News