Friday, May 10, 2024

ది లాస్ట్ సోల్జియర్

- Advertisement -
- Advertisement -

The last US soldier to leave Afghanistan

అఫ్ఘాన్ వీడివెళ్లిన చిట్టచివరి అమెరికన్ సైనికుడు
అగ్రరాజ్యం నిష్క్రమణ పూర్తి
విమానాశ్రయం తాలిబన్ల వశం
కథ ముగిసింది : బైడెన్
విజయం సాధించాం
కాబూల్ విమానాశ్రయాన్ని వశపరుచుకున్న తాలిబన్ నేతల ప్రకటన

కాబూల్/వాషింగ్టన్: అమెరికా సైనిక బలగాలు కాబూల్ విమానా శ్రయాన్ని ఖాళీ చేసి వెళ్లడంతో తాము విజయం సాధించామని తాలిబన్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం విమానాశ్రయంలోకి ప్రవేశించిన తాలిబన్ నే తలు దేశ భద్రతకు హామీ ఇచ్చారు. గతంలో తమకు వ్యతిరేకంగా పనిచేసినవారికి క్షమాభిక్ష ప్రకటించారు. ‘చివరికి అఫ్ఘానిస్థాన్ విముక్తి చెందింది. విమానాశ్రయం లోని మిలిటరీ, పౌర విభాగాలు పూర్తిగా మా ఆధీనంలో కి వచ్చాయి. త్వరలోనే మా కేబినెట్‌ను ప్రకటిస్తాం. అం తా శాంతంగా, ఉన్నది’ అని తాలిబన్ అగ్ర నేత హెక్మతుల్లావాసిఖ్ అన్నారు. ప్రజలు సహనం పా టించాలని ఆయన సూచించారు. సాధారణ పరిస్థితి నెల కొనడానికి కొంత సమయం పడుతుందన్నారు. అమెరి కా, నాటో సేనలు అఫ్ఘానిస్థాన్‌ను ఖాళీ చేసి వెళ్లడంతో రెండు దశాబ్దాల పాటు అధికారం కోసం ఎడతెగని పో రాటం చేసిన తాలిబన్లకు పట్టపగ్గాలు లేకుండాపోయా యి. 3 కోట్ల 80లక్షల అఫ్ఘన్ ప్రజల జీవితాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇక అక్కడ ఏం జరుగుతుందన్న దానిపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

తాలిబన్ల ఆధీనంలోకి ఎయిర్‌పోర్టు

కాబూల్ ఎయిర్‌పోర్టును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసు కున్న తాలిబన్లు మంగళవారం ఉదయం నుంచే భద్రతా చర్యలు ప్రారంభించారు. ఆత్మాహుతి కారు బాంబర్లు వి మానాశ్రయంలోకి ప్రవేశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎయిర్‌పోర్టులో ఎలాంటి సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేయాలన్నది తమ సాంకేతిక వి భాగం చూస్తుందని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహు ల్లా ముజాహిద్ తెలిపారు. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా దళాలు దాదాపు 1,20,000 మందిని తరలించినట్టు చె బుతున్నారు. వారిలో అమెరికన్లతోపాటు అక్కడ తమ ద ళాలకు సహకారమందించిన అఫ్ఘన్లు కూడా ఉన్నారు. నా టోలోని మిగతా దేశాల దళాలు సైనిక సిబ్బందితో వారికి సహకరించిన అఫ్ఘన్లను తరలించాయి.

అఫ్ఘన్‌ను వీడిన చివరి సైనికుడు

అఫ్ఘానిస్థాన్‌ను వీడిన చివరి సైనికుడిగా మేజర్‌జనరల్ క్రి స్‌డోనాహువే రికార్డులకెక్కారు. సోమవారం అర్ధరాత్రి కా బూల్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సి17 వి మానంలోకి చివరిగా ఎక్కింది డోనాహువేనే. అమెరికా రక్షణశాఖ ట్విట్టర్ ద్వారా డోనాహువే విమానం వద్దకు వెళ్తోన్న ఫోటోను విడుదల చేసింది. డోనాహువే 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌లో పని చేస్తున్నారు. కాబూల్‌లో అ మెరికా మిషన్ ముగిసిన సందర్భంగా చివరిగా ఆయన విమానమెక్కారు.

20ఏళ్ల మిలిటరీ ఆపరేషన్ ముగిసింది :

అఫ్ఘానిస్థాన్‌లో తమ దేశం చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించా రు. అమెరికన్ల మరిన్ని ప్రాణాలు పోకూడదనే ఈ నిర్ణ యం తీసుకున్నట్టు బైడెన్ సమర్థించుకున్నారు. మిలిటరీ లోని అన్ని విభాగాల జాయింట్ చీఫ్స్ సిఫారసు ఆగస్టు 31కి అక్కడి నుంచి తమ దళాలను పూర్తిగా వెన క్కి రప్పించామన్నారు. అఫ్ఘన్‌లోని తాలిబన్లపై అమెరికా సాగించిన 20 ఏళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ తమ దేశ సైనిక బలగాల చిట్టచివరి విమానం సోమవార ం అర్ధరాత్రి కాబూల్ నుంచి బయలుదేరిన కొన్ని గంటల తర్వాత బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉపసంహరణ : ట్రంప్

బైడెన్ ప్రభుత్వం అఫ్ఘన్ నుంచి బలగాలను ఉపసంహరిం చినతీరు అత్యంత చెడ్డగా లేదా అసమర్థంగా ఉన్నదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించా రు. ఇలాంటి ఉపసంహరణ చరిత్రలోని ఏ యుద్ధంలో నూ జరగలేదని విమర్శించారు.

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించొద్దు : ఐరాస

ఐక్యరాజ్యసమితి: అఫ్ఘన్ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు వినియోగించొద్దని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించొద్దని ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. భద్రతా మండలిలో భారత్ ప్రస్తుతం అధ్యక్ష ఉంది. కాబూల్‌ను తాలిబన్లు వశపరచుకున్న తర్వాత భద్రతా మండలిలో చేసిన మొద టి తీర్మానం ఇదే. ఈ తీర్మానం భారత్‌కు ఎంతో ప్రాధా న్యత కలిగినదని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ష్రింగ్లా తెలిపారు. అఫ్ఘనిస్థాన్‌పై తీర్మానానికి తాను అధ్యక్షత వ హించడం సంతోషంగా ఉన్నదని ష్రింగ్లా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News