Wednesday, May 15, 2024

పల్లెలు, పట్టణాల ప్రగతే బీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంగా ఆదర్శ మున్సిపాలిటీలుగా అభివృద్ధి చెందుతున్న భువనగిరి మున్సిపల్ పట్టణంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. భువనగిరి మున్సిపల్ పట్టణంలోని 6వ వార్డు హనుమాన్ వాడ, అలాగే 9, 22 వ వార్డులో జరుగుతున్న బీటి రోడ్డు నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు.

ఆదివారం మధ్యాహ్నం మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి అక్కడ జరుగుతున్న బీటి రోడ్డు పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భువనగిరి నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిచిందని ఆయన అన్నారు. మున్సిపల్ నిధులతో పట్టణ వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఒకప్పుడు పల్లెలు, పట్టణాల్లో మట్టి రోడ్లు దర్శనమిచ్చేవని, తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా కనుమరుగైందని అన్నారు.

అంతర్గత రహదారులన్నింటినీ సీసీ రోడ్లుగా, బీటీ రోడ్లుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయన్నారు. జిల్లా అభివృద్ధితోపాటు భువనగిరి మున్సిపల్ అభివృద్ధి కోసం నిధులిస్తున్న సీఎం కేసీఆర్.. అభివృద్ధి ప్రధాతగా నిలిచారని ఈసందర్భంగా గుర్తుచేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, కౌన్సిలర్ ఏవి కిరణ్ కుమార్, వార్డు ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News