Saturday, May 11, 2024

సీనియర్ సిటిజన్స్ డాక్టర్స్ డే నిర్వహించడం అభినందనీయం

- Advertisement -
- Advertisement -

హన్మకొండ ప్రతినిధి: సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విద్యారణ్యపురం, గోపాలపురం వారు ఏర్పాటు చేసిన జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రభుత్వ పరంగా సీనియర్ సిటిజన్స్ అనుభవాలను, నైపుణ్యాలను, సేవలను వినియోగించుకునేందుకు సానుకూలంగా ఉందన్నారు. ఎంజీఎం సూపరింటెండెంటు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేకంగా జీరియాట్రిక్ విభాగం ఏర్పాటుచేసి సేవలందిస్తున్నామన్నారు.

ప్రాంతీయ ఉప సంచాలకుడు ఆయుష్ వరంగల్ డాక్టర్ రవినాయక్ మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ సమయానుకూలంగా ఆహారం స్వీకరించడం, ప్రతీ రోజు కనీసం అరగంట నడవడం వంటి అలవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. వైద్య వృత్తిని సామాజిక బాధ్యతగా స్వీకరిస్తూ సేవలందిస్తామని, మీకు ఎలాంటి వైద్య సేవలైనా అందిస్తామని డాక్టర్స్ డే సందర్భంగా సంసిద్ధత వ్యక్తపర్చారు. దామెర నర్సయ్య మాట్లాడుతూ.. వార్షిక క్యాలెండర్‌ను రూపొందించుకొని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులందించిన సేవలు మరువలేనివన్నారు.

ఓరుగట్లు కన్సూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షుడు కజాంపురం దామోదర్ మాట్లాడుతూ.. తమ వద్దకు వచ్చే సీనియర్ సిటిజన్స్, సామాన్య ప్రజానీకానికి మెలకువలను తెలియచేస్తున్నామని, విద్యార్థుల్లో నైతిక, సామాజిక విలువలు పెంపొందించేవిధంగా సంస్కార వికాస శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సారంగం, ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల ఆర్‌ఎంఓ డాక్టర్ సారంగం, డీఎంహెచ్‌ఓ ప్రతినిధి డాక్టర్ వాణిశ్రీ, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్, బెండల అర్జునరావు,

56వ డివిజన్ కౌన్సిలర్ సిరంగి సునీల్‌కుమార్, ఉపాధ్యక్షుడు నాగులగాం నర్సయ్య, గంటి సాంబయ్య, కొండబత్తిని రాజేందర్, మల్లారెడ్డి, వివిధ కాలనీల ప్రతినిధులు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా ఎంజీఎం సూపరింటెండెంటు చంద్రశేఖర్, ఆయుష్ ఆర్‌డీడీ రవినాయక్, డీఎంహెచ్‌ఓ ప్రతినిధి డాక్టర్ వాణిశ్రీ, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రాజేందర్, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ మాలిక, డాక్టర్ హారిక, డాక్టర్ సౌజన్య, డాక్టర్ హర్షిణిప్రియ, డాక్టర్ శోభారాణి, డాక్డర్ మోహన్‌రావు ఆర్‌ఎంఓ రిటైర్డ్‌లకు డాక్టర్స్ డే సందర్భంగా శాలువాతో సత్కరించి మెమెంటోలను అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News