Friday, August 8, 2025

బ్యాంకు గోడ బద్దలుకొట్టి చోరీకి యత్నం.. తీరా చూస్తే..

- Advertisement -
- Advertisement -

మెదక్: జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో దొంగలు చోరీకి ప్రయత్నించారు. బ్యాంకు గోడలు బద్దలుకొట్టి లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే దొంగల ప్రయత్నం విఫలమైంది. బ్యాంకు గొడలను వాళ్లు బద్దలు కొట్టలేకపోయారు. దీంతో భారీ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీంని పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు. బ్యాంకు పక్కన ఉన్న భవనం నుంచి దొంగలు కిందకు దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలు మూడు రోజులు సెలవులు కావడంతో ఈ ఘాతుకానికి ప్రయత్నించారని అనుకుంటున్నారు. సిసిటివి ఫుటేజిని పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని సిఐ మహేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News