Tuesday, May 7, 2024

నిత్యావసరాల నిల్వలున్నాయి: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

amith shah

 

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ పొడిగించారని ఆందోళనపడక్కర్లేదని, దేశంలో ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రజలకు హామీ ఇచ్చారు. దేశ హోంమంత్రిగా ఈ హామీ ఇస్తున్నానని చెబుతూ షా ఉన్నవారు మంచిమనసుతో ముందుకొచ్చి తమకు దగ్గర్లో నివసిస్తున్న పేదల్ని ఆదుకోవాలని ఆయన వరస ట్వీట్లలో విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కర పరిస్థితిలో రాష్ట్రాల ప్రభుత్వాల పాత్రను ఆయన కొనియాడారు. కేంద్రప్రభుత్వంతో అవి కలిసి పనిచేయడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమన్నారు. ‘మనమిప్పుడు ఈ సమన్వయాన్ని మరింత పెంపొందించుకోవాలి.

అలా చేస్తే ప్రజలు లాక్‌డైన్‌కు తగినవిధంగా సహకరిస్తారు. తమ అవసరాలకోసం ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు’ అన్నారు కేంద్రహోంమంత్రి. కరోనాపై పోరాటంలో డాక్టర్లు, ఆరోగ్యపరిరక్షణ ఉద్యోగులు, శానిటేషన్ వర్కర్లు, పోలీసులు, అన్నిరకాల భద్రతా సిబ్బంది కీలకపాత్ర వహిస్తున్నారని, వారి సేవలు హృదయాన్ని తాకుతున్నాయని అమిత్ షా మెచ్చుకున్నారు. ‘ఈ ఆపత్సమయంలో మీ ధైర్యం, అవగాహన ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మార్గదర్శకాల్ని పాటించి, వారికి సహకరించాలి’ అని కేంద్ర హోంమంత్రి ప్రశంసించారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే మూడు వరకూ పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం ప్రకటించారు.

 

There are reserves of essentials
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News