Tuesday, May 14, 2024

కరోనా టెస్టులు, హాట్‌స్పాట్‌లంటే ఏమిటో తెలుసుకోవాలి

- Advertisement -
- Advertisement -

 corona tests and hotspots

 

న్యూఢిల్లీ : ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారితో అల్లకల్లోలమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాపిడ్ యాంటీబాడీస్ టెస్ట్(ఆర్‌టిపిసిఆర్), హాట్‌స్పాట్స్, కంటైన్‌మెంట్ జోన్స్, తదితర వైద్యపరిభాషా పదాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఈ పదాల అర్ధం ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి సహజంగా అందరికీ ఉంటుంది. డాక్టర్లు వీటికి వివరణ ఇస్తున్నారు. దేశంలో ఇప్పుడు ఏదైనా వ్యాధిని గుర్తించడానికి రెండు రకాల పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్‌టిపిసిఆర్ టెస్ట్, రాపిడ్ యాంటీబాడీస్ టెస్ట్.

ఆర్‌టిపిసిఆర్ టెస్ట్ అంటే
ఆర్‌టిపిసిఆర్ టెస్టు అంటే రివర్స్ ట్రాన్సిక్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ అని అర్థం. అంటే డిఎన్‌ఎలో ఆర్‌ఎన్‌ఎ ప్రతిని ప్రయోగశాల ప్రక్రియ ద్వారా మార్చడం. దీని ద్వారా యాంటీబాడీ టెస్టులకు వైరస్ ఏ విధంగా స్పందిస్తుందో తెలుస్తుంది. ఈ సమయంలో రక్తం, శరీరం స్పందన వైరస్ వల్ల ఎలా ఉంటుందో స్పష్టమౌతుంది. ఆర్‌టి పిసిఆర్ పరీక్ష వల్ల వైరస్ ఉందా లేదా తేలిపోతుంది. బాధితుని శ్వాస కోశ నాళం నుంచి గొంతు నుంచి అన్నవాహిక నుంచి నమూనాలు సేకరించి పరీక్షిస్తారు. ఈ ఫలితాలు రాడానికి 12 నుంచి 24 గంటల వరకు సమయం పడుతుందని ఢిల్లీ కేంద్రం లంగ్ సర్జన్ అరవింద్‌కుమార్ చెప్పారు. ఢిల్లీ గంగారామ్ ఆస్పత్రిలో ఆయన పనిచేస్తున్నారు. ఆర్‌టిపిసిఆర్ టెస్టులకు సమయం ఎక్కువ కావడంతోపాటు కిట్ పెద్దది కావడంతో ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని ఆయన తెలిపారు.

రాపిడ్ యాంటీ బాడీస్ టెస్టు
మరోవైపు రాపిడ్ యాంటీ బాడీస్ టెస్టుకు తక్కువ ఖర్చు కావడమే కాక, 20-30 నిముషాల్లోనే ఫలితాలు వస్తాయి. కరోనా సోకితే యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయా లేదా అని పరీక్షించడానికి ఈ పరీక్ష అవసరం అవుతుందని చెప్పారు. యాంటీబాడీస్ ఉత్పత్తి అయితే పలితం పాజిటివ్‌గా వస్తుంది. వైరస్ సోకినా యాంటీ బాడీస్ ఉత్పత్తి కాకుంటే ఫలితం నెగిటివ్‌గా వస్తుందని కుమార్ తెలిపారు. చాలా కేసుల్లో మొదట వ్యక్తికి నెగిటివ్ అని పరీక్షలో తేలినా కొన్ని రోజుల తరువాత ఆ వ్యక్తి మరో దేశం చేరినప్పుడు పాజిటివ్ అని పరీక్షలో తేలింది. ఇదే వ్యక్తి పాజిటివ్ లక్షణాలుంటే ఆర్‌టిపిసిఆర్ పరీక్ష చేయవలసి వస్తుంది.

ఆర్‌టి పిసిఆర్ టెస్టుకు ప్రైవేట్ లాబ్‌ల్లో రూ.4500 వరకు తీసుకుంటారు. ప్రభుత్వ లాబ్‌ల్లో ఉచితంగా చేస్తారు. సుప్రీం కోర్టు సోమవారం ఏప్రిల్ 8 నాటి ఉత్తర్వును సవరించింది. ప్రైవేట్ ల్యాబ్‌లు కూడా ఆయుష్మాన్ పథకం కిందకు వచ్చే బలహీన వర్గాలకు, పేదలకు ఉచితంగా పరీక్షలు చేయాలని సూచించింది

ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డాక్టర్లు అన్నవాహిక, నోటి నుంచి తీసిన నమూనాల్లో ఏదైనా ఒకదాని నుంచి పాజిటివ్ వస్తే ఆ వ్యక్తికి కరోనా సోకినట్టే అని చెప్పారు.

హాట్‌స్పాట్ అంటే
భారీ సంఖ్యలో కరోనా వైరస్ కేసులు ఒక ప్రాంతం నుంచి నమోదైతే ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్ జోన్ అంటారు. ఢిల్లీలో సోమవారం రాత్రి వరకు 47 హాట్‌స్పాట్‌లు గుర్తింపు అయ్యాయి. వీటిని కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించి దిగ్బంధం చేస్తారు.

We need to know what are corona tests and hotspots
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News