Friday, April 26, 2024

మే 3 అర్ధరాత్రి దాకా విమానాలు రద్దు : కేంద్రం

- Advertisement -
- Advertisement -

Flights

 

న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయంగా నడుస్తున్న అన్ని వాణిజ్యపరమైన పౌర విమానాలన్నింటినీ మే 3వ తేదీ అర్ధరాత్రి వరకూ రద్దు చేస్తున్నట్టు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఇంతకు ముందు అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని పొడిగిస్తూ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. 2020 మే 3వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకూ అన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాలు నడవవు’ అని మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ తర్వాత పౌర విమానయాన మంత్రి హర్దీప్‌సింగ్ పూరి మాట్లాడుతూ …లాక్‌డౌన్ పొడిగించేందుకు తగిన కారణాలున్నాయన్నారు. ‘దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఉన్న ఆంక్షల్ని తొలగించే అంశాన్ని పరిశీలించగలం. అవసరమైన పనిమీద వెళ్లాల్సిన వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మాకు తెలుసు. దయచేసి సహరించాలని కోరుతున్నాం’ అని మంత్రి చెప్పారు. కోవిడ్ 19 (కరోనా వైరస్) ప్రభావం పౌర విమానరంగంపై తీవ్రంగా పడింది. ఈ సంక్షోభంలో తాజాగా బలైంది ఎయిర్ డెక్కన్ సంస్థ. ఆదాయం పూర్తిగా నిలిచిపోవడంతో తన విమానాల రాకపోకల్ని నిరవధికంగా రద్దు చేస్తున్నట్టు, జీతాలు చెల్లించలేమని, సెలవుపై వెళ్లమని తన ఉద్యోగులకు విజప్తి చేసింది. ఇండిగో కూడా ఇదే బాటననుసరించింది. ఉద్యోగుల జీతాల్లో 25 శాతం కోత విధించింది. సీనియర్ ఉద్యోగులు జీతం లేకుండా మూడు రోజులు తప్పనిసరిగా సెలవు తీసుకోవాలని ప్రకటించింది. స్పైస్‌జెట్ కూడా ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 30 శాతం కోతపెట్టింది.ఎయిరిండియా, గో ఎయిర్ కూడా కోత విధించాయి.

 

Flights canceled until midnight on May 3
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News