Tuesday, May 14, 2024

స్పెయిన్‌లో కార్చిచ్చు..3000 భవనాలు బుగ్గిపాలు

- Advertisement -
- Advertisement -

బార్సిలోనా : స్పెయిన్ దేశం కెనరీ దీవుల్లోని అడవుల్లో కార్చిచ్చు వ్యాపించి కలకలం రేపుతోంది. అటవీ అధికారులు సమీప గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 3000 భవనాలు బుగ్గి పాలయ్యాయి. 11 వేల అటవీ ప్రాంతం మంటలకు తగులబడి పోయిందని అధికారులు చెప్పారు. నీళ్లు జల్లే విమానాలు, 10 హెలికాప్టర్ల సాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కెనరీ దీవుల్లోని లా పాల్మా కొండపైన అగ్నిపర్వతం బద్దలవ్వడమే కార్చిచ్చు వ్యాపించడానికి కారణమైందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎవరూ ఈ కార్చిచ్చువల్ల ప్రాణాలు కోల్పోకపోయినా, అరటి తోటలతోపాటు ఇతర పంటలు మంటలకు మాడి మసై పోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News