Saturday, May 4, 2024

అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నిర్భయ దోషులు

- Advertisement -
- Advertisement -

Nirbhaya case convicts

 

న్యూఢిల్లీ: 2012 ఢిల్లీ నిర్భయ కేసులో మరో ట్వీస్ట్. ఉరిశిక్షను తప్పించుకునేందుకు ముగ్గురు దోషులు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈనెల 5న కొత్త డెత్ వారెంట్‌ను జారీ చేసిన ఢిల్లీ కోర్టు.. మార్చి 20వ తేదీన ఉద‌యం 5.30 గంటలకు నలుగురు దోషులను తీహార్ జైలులో ఉరితీయాల‌ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు అన్నివిధాల ప్రయత్నస్తున్నారు. అయినా దోషులకు ఊరట లభించకపోవడంతో ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఉరిశిక్షపై స్టే విధించాలని కోరుతూ దోషులు అక్షయ్, పవన్, వినయ్ తరపున వారి లాయర్ ఎపి సింగ్, ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్(ఐసిజె)కి లేఖ రాశారు. కాగా, మ‌ర‌ణ‌శిక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని మరో నిర్భయ దోషి ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్యూరేటీవ్ పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది.

  Three Nirbhaya Convicts have Approach ICJ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News