Friday, May 3, 2024

కరోనా ఎఫెక్ట్.. బంగారం ధరలు పైపైకి

- Advertisement -
- Advertisement -

Gold prices

 

కరోనా వైరస్ ప్రభావంతో బంగారం ధరలు పరుగులుపెడుతున్నాయి. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను తగ్గించడంతో పసిడి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగాయి. ఫెడ్‌ వడ్డీరేట్లలో కోత విధించడంతో పసిడి ధరలు మరోసారి భారీ పెరుగుదలకు దారితీశాయి. దేశీయంగా పదిగ్రాముల బంగారం ధర ముంబైలో 42 వేలకు పైగా నమోదు అయ్యింది. అలాగే హైదరాబాద్, చెన్నై, విజయవాడ, వైజాగ్ లలో బంగారం ధరలు రూ.42 వేలకు పైగా పలికాయి. తులం బంగారంపై రూ.1800 పెరుగుదల నమోదైంది. అటు ఎంసీఎక్స్‌లో సోమవారం ఉదయం పది గ్రాముల బంగారం ఏకంగా రూ. 700 భారమై రూ 41,068కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ వెండి ధరలు సైతం బంగారం బాటలోనే భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ 338 పెరిగి రూ 40,825కు ఎగబాకింది. కరోనా ప్రభావంతో రానున్న రోజుల్లోనూ బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold prices raise under influence of corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News