Friday, April 26, 2024

అమెరికా హైస్కూలులో కాల్పులు… ముగ్గురు విద్యార్ధుల మృతి

- Advertisement -
- Advertisement -

Three students shot dead at Michigan high school

 

వాషింగ్టన్: అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మిచిగాన్‌లోని ఓ హైస్కూల్‌లో మంగళవారం మధ్యాహ్నం 1గంట సమయంలో 15 ఏండ్ల బాలుడు సొఫోమోర్ తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. దీంతో 16 ఏళ్ల బాలుడుతోసహా ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడ్ని చికిత్స తరువాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మిగతా 14 నుంచి 17 ఏళ్ల విద్యార్థులు ఏడుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 14 ఏళ్ల బాలిక సర్జరీ తరువాత వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది.

మృతిచెందినవారిలో బాలుడు సహా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. డెట్రాయిట్‌లోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో మృతుల్లో 16 ఏళ్ల టాటే మైర్, 14 ఏళ్ల హనా సెయింట్ జూలియానా, 17 ఏళ్ల మాడిసిన్ బాల్డిన్ ఉన్నారు. ఆస్పత్రికి చికిత్స కోసం పెట్రోల్ కారులో తరలిస్తుండగా మైర్ చనిపోయినట్టు ఓక్‌లాండ్ కౌంటీ షరీఫ్ మైకేల్ బోచర్డ్ చెప్పారు. ఈ కాల్పుల వెనుక ఉద్దేశమేమిటో తెలుసుకోడానికి దర్యాప్తు సాగుతోందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఈ దాడి జరిగిందని భద్రతాధికారి మైక్ మెక్‌కేబ్ తెలిపారు.

ఘటనకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. అంతా ఐదు నిమిషాల్లో జరిగి పోయిందన్నారు. మధ్యాహ్నం 12:55 గంటల సమయంలో పాఠశాలలో కాల్పులు జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని వెల్లడించారు. నిందితుడు ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నాడని తెలిపారు. అతని నుంచి ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ సహా పలు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. 1700 మంది విద్యార్థులున్న ఈ హైస్కూలులో కాల్పులు జరగవచ్చన్న బెదిరింపులు సోషల్ మీడియాలో ముందుగా ప్రసారం కావడంపై అధికారులు గమనించినా , దాడి జరిగిన వరకు వదంతుల గురించి తమకు తెలియలేదని బోచర్డ్ చెప్పారు.

నిందితుడు అదుపులో ఉన్నా ఏం మాట్లాడడం లేదన్నారు. నిందితుని తండ్రి తాను కొనుగోలు చేసిన 9 ఎంఎం సెమీ ఆటోమేటిక్ పిస్టల్ ను శుక్రవారం షూటింగ్‌కు ఉపయోగించాడని, అయితే ఆ తుపాకీ ఎందుకు కొన్నాడో తమకు తెలియడం లేదని తెలిపారు. నిందిడుతు పిస్టల్‌తో షూటింగ్ ప్రాక్టీసు చేశాడని, తాను పెట్టుకున్న లక్షం , ఆయుధం తాలూకు చిత్రాలను పోస్టు చేశాడని చెప్పారు. నిందితుని తల్లిదండ్రులు తమ కుమారుడిని చూడడానికి వచ్చి దర్యాప్తులో ఏం మాట్లాడొద్దని సలహా ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంతాపం వెలిబుచ్చారు. ఈ సంఘటన తరువాత స్కూలుకు లాక్‌డౌన్ విధించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News